మహారాష్ట్రలో ఆగని మత ఘర్షణలు

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టడం లేదు. రెండు రోజుల తర్వాత జల్గావ్ లో మళ్లీ రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. శనివారం విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని అతర్వాల్ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో గొడవలు జరుగుతున్నాయని జల్గాన్ ఎస్పీ ఎం రాజ్ కుమార్ తెలిపారు. ఈ అల్లర్లపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యలు తీసుకుంటున్నాం అని ఎస్పీ తెలిపారు. మార్చ్ 30న మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో నమాజ్ సందర్భంగా మసీదు వెలుపల సంగీతం వినిపించే విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి 56 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు ఎఫ్ఐఆర్ లు నమోదే చేశామని ఎస్పీ రాజ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతం అదుపులో ఉందని ఎస్పీ పేర్కొన్నారు. మసీదు వెలుపల మ్యూజిక్ ప్లే చేయడంపై రెండు వర్గాల మధ్య గొడవ జరిగిందని.. అది రాళ్లదాడికి దారి తీసిందని.. ఇది తీవ్ర ఘర్షణకు మారిందని పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)