బెండకాయ నూడుల్స్ !

Telugu Lo Computer
0


నూడుల్స్ ను శాఖాహారం దగ్గర నుంచి రకరకాల మాంసాహార వెరైటీల్లో తయారు చేసుకోవచ్చు. ఈ వంటకం అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వారి వరకూ అందరూ ఎంతగానో ఇష్టపడుతుంటారు. అయితే చైనీస్ ఫుడ్ కు పేరుగాంచిన మయన్మార్ లో రకరకాల నూడుల్స్ దొరుకుతాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అక్కడ నుంచి ఓ వెరైటీ నూడుల్స్ రెసిపీ బయటకు వచ్చింది. మయన్మార్ లోని ఓ రెస్టారెంట్ కు వెళ్లిన ఓ మహిళ తనకు ఇష్టమైన వెజిటెబుల్ నూడుల్స్ ఆర్డర్ చేయగా, ఆమె ఆశించిన దానికంటే కాస్త ఎక్స్ట్రా వెజిటెబుల్స్ చేర్చి ఇచ్చారు. అందులో బెండకాయలను చూసిన మహిళ కాస్త ఆశ్చర్యపోయినప్పటికీ ఈ ముచ్చటను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో బెండకాయ నూడుల్స్ కాస్తా వైరల్ గా మారిపోయాయి. అంతేకాదు, ఈ నూడల్స్ చాలా రుచికరంగానూ ఉన్నాయట !. 

Post a Comment

0Comments

Post a Comment (0)