మూడంతస్తుల భవనం కూలి ముగ్గురి మృతి

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని థానే జిల్లాలో భివాండిలో వర్ధమాన్ కాంపౌండ్‌లో మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తుల భవనం కూలిపోవడంతో  ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ శిథిలాల నుంచి 12 మందిని సురక్షితంగా రక్షించారు. ఆ సమయంలో కింద అంతస్తులో పని చేస్తున్న కార్మికులు, రెండో అంతస్తులో నివసిస్తున్న కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకు పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో దాదాపు 22 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. మంత్రి కపిల్ పాటిల్, థానె కలెక్టర్ అశోక్ సింగరే, అసిస్టెంట్ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే, క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)