లూధియానాలో గ్యాస్ లీకై 11 మంది మృతి

Telugu Lo Computer
0


పంజాబ్‌లోని గాయాస్‌పూర్ ప్రాంతంలో ఆదివారం గ్యాస్ లీక్ ఘటనలో 11 మంది మరణించారని పోలీసులు తెలిపారు. అస్వస్థతకు గురైన నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. లీకేజీకి కారణం, గ్యాస్ రకం ఇంకా నిర్ధారించబడలేదు. ఆ ప్రాంతాన్ని సీల్ చేసి అగ్నిమాపకదళం శకటాలను, అంబులెన్స్‌ను పంపించారు. 50 మంది సభ్యులున్న జాతీయ విపత్తు ప్రతిస్పందన బలగం (ఎన్‌డిఆర్‌ఎఫ్) కూడా అక్కడికి చేరుకుంది. మరణించిన 11 మందిలో ఐదుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారని పోలీసులు తెలిపారు. 10, 13 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు బాలురు కూడా ఉన్నారని వారు తెలిపారు. మరణాలకు కారణమై గ్యాస్ ఏమిటో తెలిశాకే దాని గురించి తెలుపుతామని ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికారి తెలిపారు. ఆ ప్రాంతం జనసమర్ధమైన ప్రాంతం కావడంతో అక్కడి వారిని ఖాళీ చేయించడానికి ప్రాధాన్యత ఇచ్చారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ దుర్ఘటన చాలా బాధాకరం అన్నారు. వీలయినంత సాయం అందిస్తానన్నారు. అక్కడ జిల్లా అధికారులు, ఎన్‌డిఆర్‌ఎఫ్ పనిచేస్తున్నారని ఆయన పంజాబీలో ఓ ట్వీట్ కూడా చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)