అశోక్ గెహ్లాట్‌, వసుంధర రాజేకు కరోనా పాజిటివ్ !

Telugu Lo Computer
0


రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా వెల్లడించారు. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. తాను తేలికపాటి లక్షణాలతో కోవిడ్ బారిన పడినట్లు చెప్పారు. వైద్యుల సలహా మేరకు.. రాబోయే కొద్ది రోజులు తన నివాసం నుంచే పనిచేస్తానని తెలిపారు. ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలని.. కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించాలని కోరారు. సీఎం గెహ్లాట్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కూడా కరోనా బారిన పడ్డారు. కోవిడ్‌ టెస్ట్‌లో తనకు పాజిటివ్ వచ్చిందనిని ఆమె ట్వీట్‌ చేశారు. వైద్యుల సలహా మేరకు తాను పూర్తిగా ఐసోలేషన్‌లో ఉన్నానని, తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. బీజేపీ కమిటీ సమావేశానికి వసుంధర రాజే హాజరయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ పెద్ద నేతలు హాజరుకావడంతో పార్టీ కార్యాలయం కూడా కిక్కిరిసిపోయింది. వసుంధర రాజేకు కరోనా పాజిటివ్ రావడంతో ఇతర బీజేపీ నాయకులు తమకు కూడా కోవిడ్ వచ్చిందేమోనని భయపడుతున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కి కరోనా సోకడంతో ఆయన అమృత్‌సర్ వెళ్లాల్సిన కార్యక్రమం రద్దు చేసుకున్నారు. గెహ్లాట్ సూరత్ వెళ్లి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ పలువురు నేతలను కలిశారు. రానున్న కొద్దిరోజుల పాటు సీఎం తన నివాసం నుంచే విధులు నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాఖాపరమైన సమావేశాలకు హాజరుకానున్నారు. గత కొన్ని రోజులుగా రాజస్థాన్‌లో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది నేతలు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)