గ్యాంగ్‌స్టర్స్ అన్సారీ సోదరులకు జైలు శిక్ష !

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్ లో మరో గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకులైన  ముఖ్తార్ అన్సారీ, అతని సోదరుడు అఫ్జల్ అన్సారీలను కిడ్నాప్, హత్య కేసులో దోషులుగా నిర్థారించిన ఎమ్మెల్యే-ఎంపీ కోర్టు ఈ రోజు శిక్ష విధించింది. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్యకు సంబంధించి కిడ్నాప్, హత్య కేసులో వీరిద్దని కోర్టు దోషులుగా నిర్థారించింది. ముఖ్తార్ అన్సారీకి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 5 లక్షల జరిమానాను విధించింది. ఇదే కేసులో ముఖ్తార్ అన్సారీ సోదరుడు, బీఎస్పీ పార్టీ తరుపున ఎంపీగా ఉన్న అఫ్జల్ అన్సారీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. రూ. 1 లక్ష జరిమానా విధించింది. దోషిగా తేలడంతో ఆయన లోక్ సభ సభ్యత్వం కోల్పోనున్నారు. ప్రజాప్రతినిధ్య చట్టం-1951 ప్రకారం రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడిన సందర్భంతో ప్రజాప్రతినిధులు తమ పదవులను కోల్పోతారు. ఘాజీపూర్ కు చెందిన గ్యాంగ్ స్టర్, పొలిటికల్ లీడర్ ముఖ్తార్ అన్సారీ, అతని సోదరుడు అఫ్జల్ అన్సారీలు బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ ని హత్య చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ భార్య అల్కా రాయ్ మాట్లాడుతూ, ''నేను న్యాయవ్యవస్థను నమ్ముతాను. యూపీలో గూండాలు, మాఫియాల పాలన ముగిసింది'' అంటూ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్తార్ అన్సారీపై 2001లో జరిగి ఉస్రీచట్టీ గ్యాంగ్ వార్ ఘటనలో హత్య కేసును పోలీసులు నమోదు చేశారు. అంతకుముందు గతేడాది డిసెంబర్ 15న అన్సారీ సహాయకుడు భీమ్ సింగ్ కు ఘాజీపూర్ లోని గ్యాంగ్ స్టర్ కోర్టు హత్య నేరం, హత్యాయత్నం కేసుల్లో 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)