వినయ్ చేతిలో 66.9 కోట్ల మంది సమాచారం !

Telugu Lo Computer
0


డేటా చోరీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తవ్వేకొద్ది సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో మరో కీలక నిందితుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్ ‎కు చెందిన వినయ్ భరద్వాజను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అతడి ల్యాప్‌టాప్‌లో 66.9 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అవకాశం ఉన్న ప్రతీ చోట నుంచి డేటాను చోరీ చేశాడు. స్కూల్ విద్యార్థుల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల డేటాను కాజేశాడు. inspirewebz వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా తన పనిని చేశాడు. ఎస్టీ, పాన్ కార్డు, అమెజాన్, నెట్ ప్లిక్స్ యూట్యూబ్, ఫోన్ పే, బిగ్ బాస్కెట్, ఇన్‌స్టాగ్రామ్, బుక్ మై షో, ఆప్ స్టాక్స్ సంస్థల నుంచి ,బైజూస్ నుంచి 9, 10, 11, 12 తరగతులకు చెందిన విద్యార్థుల డేటాను చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. డీ-మార్ట్‌, నీట్, పాన్‌కార్డ్‌, క్రెడిట్ కార్డ్‌, డెబిట్ కార్డ్, ఇన్సూరెన్స్, ఇన్‌కంట్యాక్స్‌, డిఫెన్స్‌కు సంబంధించిన అధికారుల డేటా చోరీ చేశాడు. మొత్తం 24 రాష్ట్రాలు, 8 మెట్రో పాలిటన్‌ సిటీల నుంచి వినయ్‌ భరద్వాజ డేటా చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతడు డేటాచోరీ కోసం ఆరు ప్రధాన నగరాల్లో 4.5 లక్షల మంది ఉద్యోగులను నియమించుకున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)