వేణుకు దిల్ రాజు మరో ఆఫర్ ?

Telugu Lo Computer
0


జబర్దస్త్‌ వేణుగానే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో కొనసాగారు. ఇక తాజాగా తన డైరెక్ట్‌ చేసిన బలగం మూవీ వండర్స్ క్రియేట్‌ చేస్తుండడంతో.. బలగం వేణుగా మారిపోయారు. ఇక ఇప్పుడు బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి.. ఓ పక్క కామెడీ క్యారెక్టర్స్‌ చేస్తూనే మరో పక్క.. ఘోస్ట్ డైలాగ్ రైటర్‌గా వర్క్‌ చేస్తూ వచ్చిన వేణు, తాజాగా బలగం ను తనే రాసుకున్నారు. రాసుకోవడమే కాదు.. తన కంటెంట్‌తో.. స్టార్ ప్రొడ్యూసర్‌ దిల్ రాజును ఒప్పించి.. సినిమాను ఫినిష్ చేశారు. ఇక ఇప్పుడు అందరికీ నచ్చడంతో.. రికార్డ్స్ క్రియేట్‌ చేస్తున్నారు. దాంతో పాటే తాజాగా దిల్ రాజు ఇచ్చిన ఓ బంపర్ ఆఫర్ ను కూడా అందుకున్నారు. బలగం అనుకున్నదాని కంటే.. బిగ్ హిట్ అవడం.. ఇంటర్నేషనల్ అవార్డ్స్‌ను కూడా దక్కించుకుంటూ ఉండడంతో.. తాజాగా దిల్ రాజు బలగం వేణుకు మరో ఛాన్స్ ఇచ్చారట. స్టోరీ రెడీ చేసుకో.. నీకు కావాల్సిన హీరో డేట్స్‌ ఇపిస్తా .. భారీ బడ్జెట్ కూడా ప్రొవైడ్‌ చేస్తా అని మాట ఇచ్చారట. ఇక ఇదే విషయం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌ గా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)