దేశంలో కొత్త 5,880 కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో 5,880 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 14 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 35,199కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసింది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, యుపీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. యూపీలో ఆదివారం ఒక్కరోజే 319 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 1,192గా ఉంది. మరోవైపు ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 699 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో బాధపడుతున్న నలుగురు మరణించారు.ఒమిక్రాన్ వేరియంట్ XBB.1.16 వల్ల దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరిలో 21 శాతంగా ఉన్న XBB.1.16 వేరియంట్ కేసులు, మార్చి నెలలో 32శాతానికి పెరిగాయి. తాజాగా నమోదైన కొత్త కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,47,56,616 కు చేరింది. మరణాల సంఖ్య 5,30,979కి చేరింది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.39శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,726మంది. గత 24గంటల్లో మొత్తం 205 డోస్‌ల వ్యాక్సిన్‌ను అందించారు. దీంతో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 220,66,23,527 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను అందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)