కొత్త పార్లమెంట్ ను ఆకస్మికంగా సందర్శించిన ప్రధాని

Telugu Lo Computer
0


కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆకస్మికంగా సందర్శించారు. నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న కార్మికులతో ముచ్చటించారు. దాదాపుగా గంట పాటు అక్కడే గడిపారు. పనులను క్షణ్ణంగా పరిశీలించారు. ప్రధాని వెంట లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు. కొత్త పార్లమెంట్ ఆకస్మిక తనిఖీకి వెళ్లడం ఇదే కొత్త కాదు. గతంలో సెప్టెంబర్ 2021లో కూడా ఇలాగా పార్లమెంట్ కాంప్లెక్స్ ను మోదీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2020లో కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో మోదీ మాట్లాడుతూ.. 21 శతాబ్ధపు భారతదేశానికి కొత్త పార్లమెంట్ కాంప్లెక్స అవసరం. పాత పార్లమెంట్ భవనం దేశ అవసరాలను తీరుస్తుంది, కొత్త పార్లమెంట్ భవనం దేశ ఆకాంక్షలను నెరవేస్తుందని ఆయన అన్నారు. 64,500 చదరపు మీటర్ల నిర్మాణంతో రూ. 20,000 కోట్ల సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగం. పార్లమెంట్ భవన ప్రాజెక్ట్ వ్యయం రూ. 971 కోట్లుగా అంచనా వేయబడింది. భూకంపాలు వచ్చినా కూడా తట్టుకునేలా, ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా 2,000 మంది కార్మికులు మరియు పరోక్షంగా 9,000 మంది కార్మికులు భవన నిర్మాణంలో పాల్గొంటున్నారు. కొత్త భవనంలో 1,200 మంది ఎంపీలు ఉండేందుకు అనుగుణంగా రూపొందించబడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)