లీడర్ రామయ్య బయోపిక్ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 30 March 2023

లీడర్ రామయ్య బయోపిక్ !


కర్ణాటక శాసన సభ ఎన్నికల మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జీవితంపై లీడర్ రామయ్య పేరుతో బయోపిక్ రూపొందిస్తున్నారు. మే నెలలో ఎన్నికల తర్వాత ఈ బయోపిక్ విడుదల చేయాలని యోచిస్తున్నారు. కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆగస్టు మూడున విడుదల చేయాలని ప్రస్తుతానికి నిర్ణయించారు. గత ఏడాది అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధరామయ్య 75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మరోవైపు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని సిద్ధరామయ్య చెబుతూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో 150కిపైగా స్థానాల్లో గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ యోచిస్తోంది. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే అదే ఊపులో తన బయోపిక్ కూడా విడుదల చేయాలని సిద్ధూ ప్లాన్ చేస్తున్నారు.

No comments:

Post a Comment