హార్ట్‌ బ్రేక్‌ ఇన్సూరెన్స్‌ !

Telugu Lo Computer
0


ప్రతీక్‌ ఆర‍్యన్‌ అనే ట్విటర్‌ యూజర్‌ ప్రేమలో ఉన్నప్పుడు తన ప్రియురాలితో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందంలో భాగంగా ప్రేమించుకునే సమయంలో పొరపాటున విడిపోతే ఎవరికి ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉండేలా 'హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్' పేరుతో ప్రేమలో మోసపోయిన వాళ్లు డబ్బులు తీసుకోవాలనే నిబంధన పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రతీక్‌ అతని ప్రియురాలు కలిసి ఓ బ్యాంక్‌లో జాయింట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేశారు. ప్రతి నెల ఆ అకౌంట్‌లో రూ.1000 డిపాజిట్‌ చేశారు. ఈ తరుణంలో ప్రియురాలు తనని మోసం చేయడంతో రూ.25వేలు నగదు పొందినట్లు ప్రతీక్‌ ట్వీట్‌లో తెలిపారు. ప్రతీక్‌ ట్వీట్‌లపై ఈ తరహా ఇన్సూరెన్స్‌లు ఉన్నాయా? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇన్సూరెన్స్‌ గురించి పూర్తి వివరాలు చెబితే తాము సైతం పాలసీలు తీసుకుంటామని రీట్వీట్‌లతో హోరెత్తిస్తున్నారు. ప్రేమ విఫలమై డిప్రెషన్‌, అనారోగ్య సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు తలెత్తే వారిని ఆదుకునేందుకు పయనీర్‌ ఇన్సూరెన్స్‌ వంటి సంస్థలు ప్రేమలో విఫలమైన వారి కోసం ఇన్సూరెన్స్‌ స్కీంలను అందిస్తున్నాయి. ఈ పాలసీలు తీసుకున్న వాళ్లు ప్రేమలో విఫలమైన తర్వాత క‍్లయిమ్‌ చేసుకొని నగదు పొందే అవకాశం కల్పిస్తున్నాయి. అలా లబ్ధి పొందాలంటే తాము విధించిన నిబంధనలు లోబడి ఇన్సూరెన్స్‌ తీసుకోవాలని పయనీర్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ ప్రెసిడెంట్‌ లోరెంజో చాన్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)