ఢిల్లీలో మహిళపై అఘాయిత్యం !

Telugu Lo Computer
0


ఢిల్లీలో నడి రోడ్డుపై ఓ మహిళను జుట్టుపట్టుకుని లాక్కొచ్చి, కొట్టి, క్యాబ్ లోకి ఎక్కించిన వీడియోని ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. ఈ ఘటన వైరల్ అవుతోంది వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకొని మహిళతో పాటు వెళ్తుంటారు. అంతలోనే మహిళ క్యాబ్ దిగి వెళ్లిపోతుంటుంది. తన వెనకాలే వెళ్లిన వ్యక్తి ఆ మహిళను కొట్టుకుంటూ, జట్టు పట్టుకొని లాక్కొచ్చి క్యాబ్ లో పడేస్తాడు. క్యాబ్ లో కూడా మహిళపై దాడి చేస్తాడు. అక్కడే ఉన్న జనాలు, క్యాబ్ డ్రైవర్, ఆ మహిళతో వచ్చిన రెండో వ్యక్తి ఇదంతా చూస్తూ నిలబడ్డారు తప్ప వాళ్లను ఆపేందుకు ప్రయత్నించడం లేదు. క్యాబ్ నెంబర్ ప్లేట్ ఆధారంగా డ్రైవర్ ను కనుగొని, క్యాబ్ బుకింగ్ ని ట్రేస్ చేయడానికి ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దాడి చేసిన వాళ్లను పట్టుకొని కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)