ఉత్తరప్రదేశ్ లో విద్యుత్ ఉద్యోగుల సమ్మె

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ ‎లో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. దాని వల్ల గత 60 గంటలుగా యూపీ అంధకారంలోనే ఉంది. కరెంట్ లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దాదాపు అన్ని ప్రధాన పట్టణాలలో కారుచీకట్లు కమ్ముకున్నాయి. రాత్రిళ్లు కరెంట్ లేక గ్రామాలలోని ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితికి కారణమైన సీఎంపై యూపీ వాసులు మండిపడుతున్నారు. పరీక్షల సమయంలో రోజుల కొద్దీ ఇలా కరెంట్ పోతే చదువు ఎలా ముందుకు సాగుతుంది అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీర్స్ దాదాపు అన్ని పవర్ జనరేషన్ స్టేషన్‎లను షట్ డౌన్ చేయడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతో ప్రభుత్వం అక్కడి ప్రైవేట్ ఆపరేటర్‎లతో బలవంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు యత్నంచేసింది. అది తెలిసిన విద్యుత్ ఇంజనీర్స్ విద్యుత్ ఉత్పత్తి చేయకుండా అడ్డుకున్నారు.  సమ్మె చేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు నేషనల్ పవర్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ శైలేంద్ర ధోబే, కన్వీనర్ రత్నాకర్ రావు మద్దతు తెలిపారు. ప్రైవేటీకరణ ఆపకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామిన విద్యుత్ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని యూపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్యోగులు హెచ్చరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)