అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నాడని తమ్ముడిని చంపిన అక్క !

Telugu Lo Computer
0


బెంగళూరులోని జిగణి ప్రాంతంలో భాగ్యశ్రీ అనే మహిళ తన భర్తను వదిలేసి ప్రియుడు సుపత్ర శంకరప్పతో సహజీవనం చేస్తుంది. ప్రియుడితో భాగ్య శ్రీ సహజీవనం చేయవద్దని సోదరుడు లింగరాజ్ పలుమార్లు హెచ్చరించాడు. వివాహేతర సంబంధానికి తమ్ముడు అడ్డుగా వస్తుండడంతో సోదరుడిని హత్య చేయాలని ప్రియుడితో అక్క ప్లాన్ వేసింది. ప్లాన్‌లో భాగంగా 2015లో తమ్ముడిని చంపి ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ సంచిలో పెట్టి వేర్వేరు స్థలాల్లో పడేసి పారిపోయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎక్కడ వాళ్ల ఆచూకీ కనిపించకపోవడంతో ఫైల్‌ను పక్కకు పడేశారు. ప్రియుడు ప్రియురాలు బెంగళూరు తప్పించుకొని మహారాష్ట్రలోని నాసిక్‌కు మకాం మార్చారు. ఇద్దరు పేర్లు మార్చుకొని కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి ఫోటోలను, వేలిముద్రలను తదితరాలను సేకరించి దేశంలో అన్ని పోలీస్ స్టేషన్లకు పోలీసులు పంపించారు. హత్య జరిగి ఎనిమిది సంవత్సరాల తరువాత వారు నాసిక్‌లో ఉన్నారని తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకొని బెంగళూరు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)