సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 18 March 2023

సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు !


పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. మూడు స్థానాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఫలితాలు టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపాయి. పులివెందుల సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ గెలుపు.. ప్రజా విజయం అని, మార్పుకి సంకేతం అని టీడీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. కాగా, ఈ ఫలితాలపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఘాటుగా స్పందించారు. ”ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామన్న శునకానందం ఇంకొకటి ఉండదు. గెలిచామని సంబరాలు చేసుకోవటం సిగ్గు చేటు. సైకిల్ గుర్తుపై ఓటు వేయలేదు. వైసిపి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేసింది. వైజాగ్ అభ్యర్థి చిరంజీవి రావు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా మంచి ఓట్లే వచ్చేవి. టీడీపీ వాళ్లు ఆయన కాళ్ళు గడ్డాలు పట్టుకొని తమవైపునకు తిప్పుకున్నారు. వైసిపిపై టీచర్స్ వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం చేశారు. టీచర్స్ ఎమ్మెల్సీలలో వైసిపినే గెలిచింది. టీచర్లను భయపెట్టి ఓట్లు వేయించుకోవడానికి వాళ్ళేమీ చిన్న పిల్లలు కాదు. మేధావులు ఎందుకు ఓటు వేశారో ? టీడీపీ వాళ్ళు రెండు కారణాలు చెప్పాలి. సింబల్ పై జరిగే ఏ ఎన్నికల్లో అయినా వైసిపిదే గెలుపు” అని మంత్రి రోజా అన్నారు. గుంటూరులో వైసీపీ నేత తాడిశెట్టి మురళి నివాసంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు, డొక్కా మాణిక్యవరప్రసాద్, జంగాకృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు నంబూరు శంకర్రావు, ముస్తఫా, జియావుద్దీన్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. మూడింటికి మూడు స్థానాల్లో విజయభేరి మోగించింది. గత(శుక్రవారం) రాత్రి వెల్లడైన ఫలితాలతో ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో జయకేతనం ఎగురవేసిన తెలుగుదేశం పార్టీ.. తాజాగా పశ్చిమ రాయలసీమ స్థానాన్ని కూడా చేజిక్కించుకుంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 7,543 ఓట్లతో ఘనవిజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో, రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించి విజేతను తేల్చారు. శుక్రవారం ఆధిక్యంలో నిలిచిన వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి శనివారం ఆ ఆధిక్యాన్ని నిలుపుకోలేకపోయారు. రెండో ప్రాధాన్యత ఓట్లు ఆయనకు ప్రతికూలంగా మారాయి.

No comments:

Post a Comment