పసికందును తొక్కి చంపిన పోలీసులు?

Telugu Lo Computer
0


ఝార్ఖండ్ లోని గిరిద్హా జిల్లా కోసోగోండోడిఘి గ్రామంలో ఓ కేసులో నిందితుడు భూషణ్ పాండేను పట్టుకోవడానికి పోలీసులు ఓ ఇంట్లోకి వెళ్లారు. ఇల్లు మొత్తం సోదాలు చేసిన నిందితుడి ఆచూకీ మాత్రం లభించలేదు. ఆ ఇంట్లో ఒక తల్లి నాలుగు రోజుల వయసు కలిగిన పసికందుతో కలిసి ఉంటుంది. పోలీసులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వెంటనే నవజాత శిశువు తల్లి ఎత్తుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఉలుకుపలుకు లేకపోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పసికందు మృతి చెందిందని పరీక్షించిన వైద్యుడు తెలిపారు. పోలీసులు తొక్కి చంపడంతో శిశువు మృతి చెందిన కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. పోలీసులే తొక్కి చంపారని ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దర్యాప్తు చేయాలని స్థానిక ఎస్‌పి సంజయ్ రానాకు ఆదేశించారు. శిశువు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి బన్నగుప్తా తెలిపారు. అందరూ రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలని, ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)