కవిత పిటిషన్‌పై 27న సుప్రీం కోర్టులో విచారణ !

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఈ నెల 24న కాకుండా ఈ నెల 27న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు కాజ్ లిస్ట్‌లో కవిత పిటిషన్ ఉంది. మహిళల విచారణపై ఈడీకి తగిన మార్గదర్శకాలు ఇవ్వాలంటూ సుప్రీంలో కవిత పిటీషన్ దాఖలు చేశారు. కవిత పిటీషన్‌పై న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, బేలా త్రివేదీల ధర్మాసనం విచారణ జరపనుంది. కవిత పిటిషన్‌పై ఈనెల 24వ తేదీనే విచారిస్తామంటూ మొదట తెలిపిన సిజెఐ ధర్మాసనం ఆ తర్వాత 27వ తేదీకి మార్చింది. వాస్తవానికి కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు మూడుసార్లు ప్రశ్నించారు. ఈ నెల 11, 20, 21 తేదీల్లో ఆమె మూడుసార్లు ఈడీ ఎదుట హాజరయ్యారు. తన వద్ద ఉన్న 10 ఫోన్లను ఈడీ అధికారులకు అప్పగించారు. కీలక పత్రాలు కూడా సమర్పించారు. కవిత ఈడీ ఎదుట హాజరైన ప్రతిసారీ ఆమెను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేయలేదు. కేవలం ప్రశ్నించి వివరాలు రాబట్టుకున్నారు. కవిత పిటిషన్‌పై సుప్రీం నిర్ణయంతో బీఆర్ఎస్‌లో మళ్లీ టెన్షన్ మొదలైంది. సుప్రీంలో కవిత పిటిషన్ విచారణకు మరో మూడు రోజుల గడువు పెరగడంతో ఈలోగా ఈడీ మరోసారి నోటీసులు జారీ చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈడీ తదుపరి నోటీసులు వస్తే కవిత అరెస్ట్ గ్యారంటీ అనే ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)