సమాధుల్లో నిధి నిక్షేపాలు లభ్యం !

Telugu Lo Computer
0


ఆర్మేనియాలోని మెర్సామోర్‌లో కొందరు పురావస్తు శాస్తవేత్తలు పాడుపడిన సమాధుల దగ్గర తవ్వకాలు చేపట్టారు. వారంతా ఉత్సాహంగా కొంత మేర భూమిలోకి తవ్వగా ఓ రాయి లాంటిది తగిలినట్లు శబ్దం వినిపించింది. ఏంటని అక్కడున్న మట్టిని చూడగా కళ్లు జిగేలుమన్నాయి. రెండు బంగారు నెక్లెస్‌లు బయటపడ్డాయి. దీంతో వారంతా సంబరపడిపోయారు. ఇంకా లోతుగా తవ్వితే బోలెడంత నిధి బయటపడుతుందని అనుకున్నారు. ఆ క్రమంలోనే మరింత లోతుగా తవ్వడం మొదలుపెట్టారు. అంతే! అక్కడ కనిపించినవి చూసి దెబ్బకు షాక్ అయ్యారు. రెండు ఆస్థిపంజరాలతో పాటు బంగారం, వెండి, ముత్యాలు, లాకెట్లు, వస్తువులు, రాగి ముంతలు లాంటివి ఎన్నో నిధినిక్షేపాలు ఒకే చోట కనిపించాయి. వాటన్నింటిపైనా అధ్యయనం చేశారు శాస్త్రవేత్తలు. నిధి నిక్షేపాలు అన్ని కూడా 3200 సంవత్సరాల కిందటివి అని తేల్చారు. ఆ సమయంలో ది గ్రేట్ రామ్ సెన్ పాలకుడుగా ఉండేవాడని నిర్ధారణకు వచ్చారు. అలాగే ఆ సమాధుల్లో దొరికిన బంగారం, వెండి, ముత్యాలు కాంస్య యుగానికి గుర్తించారు. అటు లభించిన ఆస్థిపంజరాలు భార్యభర్తలవని కనుగొన్నారు. వారి వయస్సు 30-40 మధ్య ఉండొచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇద్దరూ ఒకేసారి మరణించి ఉండొచ్చునని అంచనా వేశారు. అలాగే తవ్వకాలు చేపట్టిన స్థలంలో పలు చోట్ల ఎముకలు లాంటి అవశేషాలు దొరకడంతో భావిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)