యూజ్ అండ్ త్రో బాటిళ్లు వాడక పోవడమే ఉత్తమం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 26 March 2023

యూజ్ అండ్ త్రో బాటిళ్లు వాడక పోవడమే ఉత్తమం !


సమ్మర్ సీజన్ వచ్చేసింది. వాటర్‌ బాటిల్‌ వెంటలేనిదే బైటికెళ్లలేని పరిస్థితి. లేదంటే బైట షాపుల్లో నీళ్ల బాటిల్ కొనుక్కుని, దాన్ని తాగి పడెయ్యకుండా ఇంటికి తెచ్చుకునే వాళ్లు కూడా ఉంటారు. అవే మన పాలిట డేంజర్‌ బాటిళ్లవుతాయి. మనం చాలా సురక్షితం అని గట్టిగా నమ్మే ఈ వాటర్ బాటిళ్లలో ఎంత బ్యాక్టీరియా పేరుకుపోయి ఉంటుందో తెలిస్తే షాకైపోతాం. టాయిలెట్ సీట్‌పై ఉండే బాక్టీరియా కంటే ఇది 40వేల రెట్లు అధికంగా ఉంటుంది. అంతేకాదు కంప్యూటర్ మౌస్‌తో పోలిస్తే బాటిళ్లపై నిల్వ ఉండే క్రిములు 4 రెట్లు ఎక్కువ. పెంపుడు జంతువుల నీటి గిన్నె కంటే 14 రెట్లు ఎక్కువ. వంటగది లోని సింక్‌తో పోలిస్తే రెండు రెట్ల బ్యాక్టీరియా నీళ్ల బాటిళ్లలో ఉంటుంది. రీయూజ్ బాటిళ్లలో నీళ్లు తాగితే మనపై యాంటీ-బాక్టీరియా మందుల ప్రభావం తగ్గుతుంది. కడుపునొప్పి, అసిడిటీ, విరేచనాలు, వాంతులు, వికారం వంటి సమస్యలు రావచ్చు. రక్తపోటు పెరగొచ్చు, తగ్గొచ్చు. యూరినల్ ఇన్ఫెక్షన్లు రిపీటయ్యే ప్రమాదం ఉంది. బాలికల్లో హార్మోన్ మార్పులు అకాలంగా ఉండవచ్చు. గుండెపోటుకు గురయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువట. వన్‌టైమ్ యూజ్ బాటిళ్లు మాత్రమే కాదు, మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని గంటకోసారైనా బైటికి తీసి తాగే వాటర్ బాటిళ్లతో కూడా ముప్పు పొంచివుంది. సరైన రీతిలో శుభ్రం చెయ్యకుండా వాడితే అందులో విషపూరిత బ్యాక్టీరియా చేరే ఛాన్సుంది. బాటిల్ పైభాగం, మూత, అడుగుభాగం అన్ని చోట్లా రెండు రకాల బ్యాక్టీరియా పేరుకుపోతుంది. ఒకటి గ్రామ్ నెగటివ్ బాక్టీరియా, రెండు బాసిల్లస్ బాక్టీరియా. గ్రామ్-నెగటివ్ బ్యాక్టీరియా ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. బాసిల్లస్ బ్యాక్టీరియా జీర్ణాశయ సమస్యలకు దారితీస్తుంది. పరిశోధనల తర్వాత తేలిన నిజం ఇది.ఇది చాలా ప్రమాదకమైన బ్యాక్టీరియా. బాటిళ్లను పదేపదే వాడడం, శుభ్రంగా చుకోకపోవడం వల్లే ఈ బ్యాక్టీరియా పెరుగుతుంది.మరి… ఈ ముప్పు నుంచి తప్పించుకునే మార్గమే లేదా? అంటే లేకేం ఉంది అంటున్నారు ఎక్స్‌పర్ట్‌లు. ఇంట్లో ఇతర పాత్రలను ఎంత జాగ్రత్తగా ఉపయోగిస్తారో, వాటర్ బాటిల్‌ను అంతే శుభ్రంగా ఉంచుకోవాలన్నది ప్రధాన సూచన. వేసవిలోనే కాదు… ఏ సీజన్లోనైనా వాటర్ బాటిళ్ల మెయింటెనెన్స్ అనేది చాలా కీలకం. స్టీల్, ప్లాస్టిక్, మెటల్ మెటీరియల్ ఏదైనా వాడే వాటర్ బాటిళ్లు క్లీన్ చేయడం అనేది దినచర్యగా మార్చుకోవాలి. వాటర్ బాటిల్‌ను కనీసం రోజుకు ఒకసారి సబ్బుతో, వేడి నీళ్లతో కడగాలి. వారానికి ఒకసారి తప్పనిసరిగా శానిటైజ్ చేయాలి. కడిగిన తర్వాత ఎండలో కొంతసేపు ఆరనివ్వాలి. అలా చేయడం ద్వారా వాసనతో పాటే అందులోని బ్యాక్టీరియా కూడా నాశనమౌతుంది. అన్నిటికంటే గాజు సీసాలు సురక్షితం.  కానీ బరువైనవి కనుక వాటికెప్పుడో మంగళం పాడేశాం. విధిలేని పరిస్థితుల్లో ప్లాస్టిక్ బాటిళ్ల మీదే ఆధారపడుతున్నాం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ సైన్సెస్ ప్రకారం, నాసిరకం ప్లాస్టిక్ బాటిళ్ల తయారీలో బీపిఎ అనే రసాయనాన్ని వాడతారు. అందుకే  తక్కువ ధరకు లభించే ప్లాస్టిక్ బాటిళ్లను కాకుండా నాణ్యమైన బాటిల్‌ను వాడితే మంచిదట. స్కూలుకెళ్లే పిల్లలు వీలైనంతవరకు ప్లాస్టిక్ బాటిల్స్ వాడకపోతేనే మంచిది.  లాలాజలం గాలికి తగిలి దానిపై క్రిములు ఏర్పడి బాటిల్ మూత భాగంలో పేరుకుపోయే ఛాన్సుంది. వీటికి తోడు ఇ.కోలి వంటి బ్యాక్టీరియాలు నీళ్ల బాటిళ్లలోనే పెరుగుతుంటాయ్. దగ్గు, జలుబుతో బాధపడేవారు అదే చేతులతో సీసాని పట్టుకోవడం వల్ల కూడా బాక్టీరియాలు ఏర్పడతాయ్. అందుకే  మన నోరు క్రిములకు కేరాఫ్ అవుతోందనేది నిపుణుల హెచ్చరిక. రీయూజబుల్ బాటిళ్లతో ఎంత ప్రమాదం పొంచివుందనే అవేర్‌నెస్ జనంలో కల్పించాల్సిన అవసరం  ఉంది.

No comments:

Post a Comment