కూలిన చీతా హెలికాప్టర్‌

Telugu Lo Computer
0


అరుణాచల్ ప్రదేశ్‌లో భారతీయ సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కూలింది. ఆ రాష్ట్రంలోని మండలా ప్రాంతంలో అది కూలినట్లు తెలుస్తోంది. దాంట్లో ఉన్న ఇద్దరు సిబ్బంది కనిపించకుండాపోయారు. లెఫ్టినెంట్ కల్నల్‌తో పాటు ఓ మేజర్ కూడా మిస్సైనట్లు భావిస్తున్నారు. ఇవాళ ఉదయం 9.15 నిమిషాలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో ఆ హెలికాప్టర్‌కు సంబంధాలు తెగిపోయినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని బోమిడిలా వద్ద ఆపరేషనల్ సోర్టీ నిర్వహిస్తున్న సమయంలో చీతా హెలికాప్టర్‌తో కాంటాక్ట్ తెగిపోయినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)