బాల్యంలోకి తీసుకువెళ్లిన ఆనంద్‌ మహీంద్ర మీమ్ !

Telugu Lo Computer
0


మిలీనియల్స్‌, జడ్ జనరేషన్‌కు రిమోట్ కంట్రోల్ లేని టీవీలు తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో రిమోట్ కంట్రోల్ లేని టీవీలే ఉండేవి. చానల్ మార్చాలంటే టీవీ సెట్ దగ్గరకు వెళ్లి మార్చుకోవాల్సిందే. టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కడం జనాన్ని బద్దకస్తులుగా మార్చిందనేది కాదనలేని వాస్తవం. టెక్నాలజీ రాకతో రిమోట్ కంట్రోల్ ఆవిష్కరణ ఎలాంటి పరిణామాలకు దారితీసిందో అందరికీ తెలిసిందే. కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర లేటెస్ట్ పోస్ట్ ఈ ఆలోచనలనే రేకెత్తించడంతో పాటు అందరినీ బాల్యంలోకి తీసుకువెళ్లింది. రిమోట్ కంట్రోల్ లేనిరోజుల్లో పిల్లలే రిమోట్ కంట్రోల్‌గా మారిన రోజులను గుర్తుచేసే మీమ్‌ను  మహీంద్ర గ్రూప్ చీఫ్ షేర్ చేశారు. తానే రిమోట్ కావడంతో మా తల్లితండ్రులకు ఇలాంటి టీవీ ఉండేదని గుర్తుందని మీమ్‌లో రాశారు. అద్భుతం రిమోట్‌ను అసలు కనుగొనకుంటే మనమంతా కొన్ని కిలోలు తక్కువ బరువుతో తేలికగా ఉండేవాళ్లం అని మీమ్‌ను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్ర రాసుకొచ్చారు. ఇప్పటి రోజులకు భిన్నంగా కుటుంబసభ్యులందరినీ టీవీ ఒక్క దగ్గర చేర్చేదని పాత రోజులను పలువురు యూజర్లు గుర్తుచేసుకున్నారు. ఇప్పడు ప్రతి రూంలోనూ టీవీలున్నాయని, మొబైల్ ఫోన్లలోనూ టీవీ చూస్తున్నారని, ఏ ఒక్కరికీ కుటుంబసభ్యులతో మాట్లాడే సమయం లభించడం లేదని కామెంట్స్ సెక్షన్‌లో రాసుకొచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)