అమెరికాలో పంజాబీ నటుడిపై కత్తితో దాడి - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 16 March 2023

అమెరికాలో పంజాబీ నటుడిపై కత్తితో దాడి


అమెరికాలో పంజాబీ నటుడు అమన్ ధలివాల్ పై గుర్తుతెలియని ఆగంతకులు కత్తితో దాడికి పాల్పడ్డారు. దీంతో అమన్ ధలివాల్ కు గాయాలయ్యాయి. దీంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అమన్ ధలివాల్ గురువారం ఉదయం కాలిఫోర్నియాలోని ప్లానెట్ ఫిట్ నెస్ జిమ్ లో వర్కవుట్ చేస్తుండగా దాడి జరిగింది. కొంత మంది గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడికి దిగారు. చుట్టు పక్కల ఉన్నవారు అక్కడికి చేరుకునే సరికే నిందితులు తప్పించుకున్నారు. కింద పడిపోయిన అమన్ ధలివాల్ ను దగ్గర్లోని ఓ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అయితే అమన్ ధలివాల్ పై ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు అనేది తెలియరాలేదు. అయితే అతనిపై దుండగులు దాడి చేస్తున్న దృశ్యాలు జిమ్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమన్ ధలివాల్ పరిస్థితి ఆందోళకరంగా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయపై ఆయన కుటుంబ సభ్యులు, వైద్యులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. పంజాబ్ లోని మాన్సాలో అమన్ ధలివాల్ పుట్టారు. ఆయన పలు పంజాబీ, హిందీ, తెలుగు సినిమాల్లో నటించారు. 2010లో వచ్చిన హృతిక్ రోహషన్, ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రదారులుగా నటించిన జోదా అక్బర్ చిత్రంలో అమన్ ధలివాల్ ప్రముఖ పాత్ర చేశారు.

No comments:

Post a Comment