కెనడాలో పంజాబ్ విద్యార్థులకు బహిష్కరణ గండం

Telugu Lo Computer
0


పంజాబ్ నుంచి కెనడా వెళ్లి ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న 700 మంది విద్యార్థులు ఆ దేశం నుంచి బహిష్కరణ (డీపోర్టేషన్) గండాన్ని ఎదుర్కొంటున్నారు. జలంధర్ కు చెందిన ఓ ఏజెంట్ ఫేక్ అడ్మిషన్ లెటర్లతో వీళ్లందరికీ వీసాలు ఇప్పించడమే ఇందుకు కారణమని పంజాబ్ పోలీసులు వెల్లడించారు. జలంధర్​లో ఎడ్యుకేషన్ మైగ్రేషన్ సర్వీసెస్ పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న బ్రిజేశ్ మిశ్రా అనే ఏజెంట్ ఫేక్ డాక్యుమెంట్లతో వీసాలు ఇప్పించి వందలాది మందిని కెనడా పంపినట్లు గుర్తించామన్నారు. ఆరు నెలలుగా ఆ ఏజెంట్ ఆఫీసు మూసి ఉందని, వివరాలను తెలుసుకుంటున్నామని చెప్పారు. కెనడాలో చదువుకునేందుకు వీసా కావాలంటే ముందుగా అక్కడి కాలేజీలు ఇచ్చే అడ్మిషన్ ఆఫర్ లెటర్​ను, ఫీజు కట్టిన రిసిప్ట్​ను సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే కెనడా ప్రభుత్వం ఎడ్యుకేషన్ వీసాలు ఇస్తుంది. అయితే, జలంధర్​కు చెందిన బ్రిజేశ్ 2018-19లో వందలాది మంది స్టూడెంట్లకు ఫేక్ ఆఫర్ లెటర్లతో వీసాలు ఇప్పించి పంపించాడు. వాళ్లు అక్కడికి వెళ్లాక వేరే కాలేజీల్లో జాయిన్ అయి చదువుకునేందుకు ఏర్పాట్లు కూడా చేశాడు. వీరిలో కొంత మంది ఆఫర్ లెటర్​లో పేర్కొన్న కాలేజీలోనే తర్వాతి సెమిష్టర్ లో అడ్మిషన్ అయ్యారు. మరికొందరు ప్రైవేట్ కాలేజీలో అడ్మిషన్ లెటర్ పొంది, అక్కడికి వెళ్లాక గవర్నమెంట్ కాలేజీల్లో చేరారు. ఇలా వీరంతా చదువులు పూర్తి చేసుకుని, అక్కడే ఉద్యోగాలూ ప్రారంభించారు. అయితే, కెనడాలో పర్మనెంట్ రెసిడెన్సీ కోసం వీరంతా ఇటీవల ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోవడంతో అసలు గుట్టంతా రట్టయింది. ఈ వ్యవహారంలో ఏజెంట్ బ్రిజేశ్ మిశ్రా తెలివిగా చీట్ చేశాడని భావిస్తున్నారు. కెనడాలోని హంబర్ కాలేజీలో అడ్మిషన్ ఇప్పిస్తానని ఒక్కో స్టూడెంట్ నుంచి అడ్మిషన్ ఫీజు సహా రూ. 16 లక్షలను బ్రిజేశ్ వసూలు చేశాడు. అక్కడికి వెళ్లాక వేరే కాలేజీలో జాయిన్ కావచ్చని, ఇబ్బందేమీ ఉండదని చెప్పాడు. అన్ని డాక్యుమెంట్లపై సంబంధిత స్టూడెంట్ల సంతకాలే పెట్టించాడు. కెనడా వెళ్లాక ప్రైవేట్ కాలేజీల నుంచి సర్కారు కాలేజీ లకు షిఫ్ట్ అయిన స్టూడెంట్లకు ఫీజు డబ్బు లనూ వాపస్ ఇచ్చాడు. కానీ కాలేజీ షిఫ్ట్ అయిన విషయాన్ని అక్కడి ప్రభుత్వానికి చెప్పకపోవడంతో ఇప్పుడు స్టూడెంట్లు ఇరుక్కున్నారు. ఫేక్ ఆఫర్ లెటర్లతో వీసాలు పొందినందున, దేశం నుంచి ఎందుకు పంపించకూడదో చెప్పా లంటూ కెనడియన్ ఏజెన్సీ డీపోర్టేషన్ లెటర్లు పంపింది. దీంతో కోర్టుల్లో సవాల్ చేయడం లేదా ఇండియాకు రావడం తప్ప ఆ స్టూడెంట్లకు వేరే మార్గం లేని పరిస్థితి నెలకొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)