భారత్, చైనాలు సిద్ధంగా ఉంటే డోక్లామ్ పై చర్చించుకుందాం !

Telugu Lo Computer
0


భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ డోక్లామ్ వివాదంపై చేసిన తాజా వ్యాఖ్యలు భారత్‌లో కలకలం రేపుతున్నాయి. ఆరేళ్లుగా డోక్లామ్‌ అంశంపై భారత్‌, చైనా బలగాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే విషయంపై గత ఏడాది రెండు దేశాల మధ్య తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ క్రమంలో భూటాన్‌ ప్రధాని చేసిన కామెంట్స్‏తో భారత్‌‏లో టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. ఇంతవరకు డోక్లామ్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకోవడం చట్టవిరుద్ధమని భారతదేశం భావిస్తుంటే, ఈ వివాదం పరిష్కారానికి భాగమవ్వడానికి చైనాకు కూడా హక్కు ఉందని భూటాన్ ప్రధాని అనడం ఒక్కసారిగా షాకింగ్‏కు గురిచేసింది. బెల్జియన్ డైలీ లా లిబ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షెరింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమని  లోటే షెరింగ్  తెలిపారు. భారత్, చైనాలు సిద్ధంగా ఉంటే చర్చించుకుందామని పిలుపునిచ్చారు. భారత్, చైనా, భూటాన్ కూడలిలో ఉండే ప్రాంతమే డోక్లామ్. దీనినే ట్రై జంక్షన్ అని పిలుస్తారు. ఈ ఎత్తైన పీఠభూమి సిలిగురి కారిడార్ కి దగ్గరగా ఉంది. అందుకే చైనా తన ఎత్తుగడలో భాగంగా ఈ ప్రాంతంలో రోడ్డు పనులు చేపట్టి విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన భారత్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. అంతే కాదు భారత్ బలగాలు చైనా చేపడుతున్న పనులను అడ్డుకున్నాయి కూడా. ఈశాన్య భారత రాష్ట్రాలను భారత్‏లోని మిగతా భూ భాగంతో కలిపే ప్రాంతమే సిలిగురి కారిడార్. గత కొన్ని దశాబ్దాలుగా ఈ ట్రై జంక్షన్ పాయింట్ ఇంటర్నేషనల్ మ్యాప్ లో బటాంగ్ లా లో ఉంది. ఇది భారత్‏కి పశ్చిమాన, చైనాకి ఉత్తరాన, భూటాన్ కి అగ్నేయంలో ఉంది. అయితే చైనా ఈ ట్రై జంక్షన్‏ని ఇక్కడి నుంచి దక్షిణం వైపు ఉన్న మౌంట్ గిమ్ మోచి శిఖరానికి మార్చాలని అనుకుంటోంది. చైనా కనుక ఇదే ప్లాన్‏ను వర్కౌట్ చేస్తే డోక్లామ్ భూభాగం చైనాలో పూర్తిగా భాగమవుతుంది. అందుకే భారత్ దీనికి ఏమాత్రం అంగీకరించడం లేదు. 2017 నుంచి చైనా ఈ విషయంలో తగ్గినట్లే తగ్గి..డోక్లామ్ వెంబడి నేరుగా తూర్పున భూటాన్ భూభాగంలో ఉన్న అమోచు నది లోయ వెంబడి విస్తరించే ప్రయత్నం చేసింది. అనేక గ్రామాల్లో చైనా ఏకంగా రహదారిని నిర్మించింది. దీంతో చేసేది ఏమీ లేక తమ భూభాగాన్ని భూటాన్ చైనాకు అప్పగించింది. ఈ అక్కసుతోనే తాజాగా భూటాన్ ప్రధాని తాజా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అదే క్రమంలో చైనాతో తమకు ఎలాంటి సరిహద్దుల సమస్యలు లేవని భూటాన్ బుకాయిస్తోంది. అంతే కాదు పలుమార్లు సమావేశం అయిన అనంతరం విభజన రేఖను ఏర్పాటు చేసుకుంటామని చైనాను వెనకేసుకు వచ్చే ప్రయత్నం కూడా చేస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)