తెలంగాణలో ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. 2023-24 విద్యా సంవత్సరం జూన్12 న ప్రారంభం అవుతుందని పేర్కొంది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 20 వరకు SA - II ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, ఆరు నుంచి ఎనిమిది తరగతులకు 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి మ. 12:30 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21 నుంచి 24 వరకు పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. ఆ తరువాత విద్యార్థులకు మార్కులు చెప్పి సెలవులు ప్రకటించనున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)