శని శింగనాపూర్ లో ఇళ్ళకి తలుపులు ఉండవు !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని శని శింగనాపూర్. ఈ గ్రామాన్ని శని దేవుడే కాపాడుతున్నాడని గ్రామస్తులు చెబుతారు. ఈ కారణంగా, ఈ గ్రామంలోని ఏ ఇంటికీ తలుపులు ఉండవు. అంతేకాదు.. ఇక్కడి దుకాణాలు, బ్యాంకులకు కూడా తాళాలు ఉండవు. శనిశింగనాపూర్ గ్రామస్తులకు శనిదేవునిపై అచంచలమైన భక్తి, విశ్వాసం ఉన్నాయి. శనిదేవుడు తమ కుటుంబాలను, తమ ఇళ్లను ఎల్లప్పుడూ రక్షిస్తాడని ప్రజల విశ్వాసం. ఈ నమ్మకం కారణంగానే నేటికీ గ్రామంలోని ప్రజలు తమ ఇళ్ల తలుపులకు తాళాలు వేయరు, దుకాణాలకు, బ్యాంకులకు కూడా తాళాలు వేయరు. వారు తాళాలు వేయకపోవడమే కాదు.. ఇంత వరకు అక్కడ ఒక్క చోరీ జరిగిన దాఖలాలు కూడా లేవు. హిందూ మత గ్రంధాల ప్రకారం.. శని దేవుడు సూర్య భగవానుడి కుమారుడు. న్యాయ దేవుడు అని కూడా పిలుస్తారు. శనిదేవుడు ఈ లోకంలో మనుషులు చేసే చెడు పనులకు శిక్షలు వేస్తాడు. శని శింగనాపూర్ ప్రజలు.. గ్రామస్థులను రక్షించే శని దేవుడిని గ్రామ అధిపతిగా భావిస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)