ఈ ముగ్గురిలో కామన్‌గా ఉన్నదేంటి ?

Telugu Lo Computer
0


జస్ట్‌ ఆస్కింగ్‌, ఇది కేవలం జనరల్‌ నాలెడ్జ్‌ క్వశ్చన్‌ మాత్రమే. లలిత్‌మోడీదీ, నరేంద్రమోడీ, నీరవ్‌మోడీ ఈ ముగ్గురిలో కామన్‌గా ఉన్నదేంటి?. చెప్పుకోండి చూద్దామంటూ మరో కాంట్రవర్సీకి తెరలేపారు ప్రకాష్‌రాజ్‌. రాహుల్‌ కామెంట్స్‌ని మరోసారి గుర్తుచేస్తూ ప్రకాష్‌రాజ్‌ పెట్టిన ఈ ట్వీట్‌ ఇప్పుడు కల్లోలం రేపుతోంది. ఎవరైతే నాకేంటి? ఎవరేమనుకుంటే నాకేంటి ?. నేను మోనార్క్‌ని! నా కనిపించిందే చెబుతా !. అయినా నేనడిగేది జస్ట్‌ జనరల్‌ నాలెడ్జ్‌ క్వశ్చనే. ఇందులో కాంట్రవర్సీ ఏముంది ? మీకు తెలిస్తే చెప్పండి ! అంటూ ప్రకాష్‌రాజ్‌ వదిలిన ముగ్గురు మోడీల ఫొటో ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. లలిత్‌మోడీ, నరేంద్రమోడీ, నీరవ్‌మోడీ… ఈ ముగ్గురిలో కామన్‌గా ఉన్నదేంటి? చెప్పుకోండి చూద్దామంటూ ఫజిల్‌ పెట్టారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పరోక్షంగా మద్దతు పలుకుతూ ప్రకాజ్‌రాజ్‌ చేసిన ఈ ట్వీట్‌ కలకలం రేపుతోంది. దీనికి ముందు, రాహుల్‌గాంధీపై అనర్హత వేటేస్తూ లోక్‌సభ విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను ప్రకాష్‌రాజ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రియమైన పౌరులారా ఇలాంటి రాజకీయాలకు సిగ్గుపడాలి !. మౌనంగా ఉంటే మరింత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దేశం కోసం మాట్లాడే సమయం వచ్చిందంటూ ట్వీట్‌ చేశారు. ప్రకాష్‌రాజ్‌ చేసిన ఈ ట్వీట్స్‌ అన్నీ ఇప్పుడు వైరల్‌గా మారాయ్. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)