ఆదిమూలపు సురేష్ కి తప్పిన ప్రమాదం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 25 March 2023

ఆదిమూలపు సురేష్ కి తప్పిన ప్రమాదం


విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ ఆర్కే బీచ్ లో పారా మోటరింగ్ కు వెళ్ళేందుకు సిద్ధమవ్వగా ఇసుక తిన్నెల్లో ఒరిగిపోయింది. ఈ ఘటనతో మంత్రి సురేష్ తో పాటు అక్కడే వున్న ఇతర మంత్రులు షాక్ అయ్యారు. జీ 20 సదస్సుల్లో భాగంగా విశాఖలో మారథాన్, సాహసక్రీడలు జరుగుతున్నాయి. ఆదివారం కావడంతో ఆర్కే బీచ్ లో ఉత్సాహంగా జీ 20  మారథాన్ ప్రారంభం అయింది. మంత్రులు ఆదిమూలపు సురేష్,విడదల రజనీ, గుడివాడ అమర్నాథ్ మారథాన్ ను ప్రారంభించారు. ఉదయం మారథాన్ ప్రారంభించిన సురేష్ నిర్వాహకులు ఆహ్వానం మేరకు పారా మోటారింగ్ రైడ్ కు బయలు దేరారు. ఈ ఈవెంట్స్ ను మంత్రి విడదల రజనీ జెండా ఊపి ప్రారంభించారు. అయితే, పారా మోటరింగ్ ఫస్ట్ రైడ్ కు వెళ్ళేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ ఉత్సాహం చూపించారు. అయితే, విండ్ డైరెక్షన్ సహకరించకపోవడంతో కుదుపులకు గురైంది. మంత్రి క్షేమంగా ఉండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

No comments:

Post a Comment