రాజ్ ఘట్ వద్ద కాంగ్రెస్ సత్యగ్రహ దీక్ష - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 25 March 2023

రాజ్ ఘట్ వద్ద కాంగ్రెస్ సత్యగ్రహ దీక్ష

రాహుల్​ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్​ పార్టీ ఢిల్లీ రాజ్ ఘట్ వద్ద సత్యగ్రహ దీక్షను ప్రారంభించింది. పోలీసుల అనుమతి లేనప్పటికీ దీక్షలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేత జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. రాజ్ ఘట్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని ఇప్పటికే పోలీసులు తెలిపారు. మరోవైపు హైదరాబాద్​ గాంధీభవన్​లోని గాంధీవిగ్రహం ముందు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్​రావు ఠాక్రే, పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి, ఇతర ముఖ్య నేతలంతా దీక్ష చేస్తున్నారు. రాహుల్​ గాంధీపై అనర్హత వేటుకు సంఘీభావంగా మార్చి 25న దేశవ్యాప్తంగా గాంధీ విగ్రహాల ఎదుట నిరసన చేపట్టాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. 

No comments:

Post a Comment