కష్టకాలంలోనే నిజమైన స్నేహితులెవరో తెలుస్తుంది !

Telugu Lo Computer
0


మునుపెన్నడూ లేనంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంకకు ఇతర దేశాలేవీ చేయనంత గొప్ప సహాయాన్ని భారత దేశం చేసిందని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రి కొనియాడారు.కష్టకాలంలోనే నిజమైన స్నేహితులెవరో తెలుస్తుందన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నపుడు భారత దేశం తమకు అండగా నిలిచిందని చెప్పారు. అవసరంలో స్నేహంగా ఉన్నవారే నిజమైన స్నేహితులని చెప్పారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు అండగా నిలవడం కోసం భారత ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని, అందువల్ల భారత దేశానికి తాము ఎంతో కృతజ్ఞులమని తెలిపారు. శ్రీలంక రుణాల ఊబిలో కూరుకుపోకుండా కాపాడటానికి భారత దేశం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ఇతర దేశాలు చేసిన సాయం కన్నా చాలా ఎక్కువ అని అలీ సబ్రి తెలిపారు. శ్రీలంకకు సాయపడటానికి భారతీయులు కూడా ముందుకు వచ్చారని పేర్కొన్నారు. రైసినా డయలాగ్ 'ఐడియాస్ పాడ్'లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది శ్రీలంక తీవ్ర రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో మన దేశం దాదాపు 4 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక సాయం చేసింది. దీనిలో కొంత రుణం కూడా ఉంది. ఆహారం, ఇంధనం వంటివాటిని కొనడానికి తగిన ఏర్పాట్లు చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)