లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డుల కార్యక్రమంలో 'బలగం' చిత్రానికి రెండు అవార్డులు

Telugu Lo Computer
0


అంతర్జాతీయ వేదికపై  'బలగం'  సత్తా చాటింది. చలన చిత్రరంగంలో ప్రత్యేకంగా భావించే లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డుల కార్యక్రమంలో రెండు అవార్డులు సొంతం చేసుకుంది. 'బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌' విభాగానికి గాను దర్శకుడు వేణు, 'బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ సినిమాటోగ్రఫీ' విభాగానికి గాను ఆచార్య వేణు ఈ అవార్డులను దక్కించుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ దిల్‌రాజు ప్రొడెక్షన్స్‌ ట్వీట్‌ చేసింది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌కు అభినందనలు తెలిపింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో 'బలగం'  రూపుదిద్దుకుంది. గ్రామీణ వాతావరణం, బంధుత్వం, కుటుంబ విలువలు తెలియజేస్తూ తెరకెక్కిన ఈ చిత్రానికి వేణు దర్శకత్వం వహించారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్‌, సుధాకర్‌ రెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. దిల్‌రాజు ప్రొడెక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌, హన్షిత దీన్ని నిర్మించారు. మార్చి 3న విడుదలైన ఈ సినిమా అంతటా మంచి టాక్‌ అందుకుంది. ప్రస్తుతం ఇది ప్రైమ్‌ వేదికగా అందుబాటులో ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)