ఐరాస సమావేశాలకు నిత్యానంద ప్రతినిధులు !

Telugu Lo Computer
0


వివాదాస్పద, స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు నిత్యానంద 'కైలాస' పేరుతో ఆయన సృష్టించుకున్న ప్రత్యేక దేశం తరఫున ఇద్దరు ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరయ్యారు. తనను తాను విజయప్రియ నిత్యానందగా పరిచయం చేసుకున్న ఓ మహిళా ప్రతినిధి నిత్యానందను భారత ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఆరోపణలు చేశారు. జెనీవాలో జరిగిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ (సీఈఎస్‌సీఆర్‌) సమావేశంలో ఆమె మాట్లాడారు. ''హిందువుల కోసం తొలి సార్వభౌమ దేశం 'కైలాస' ఏర్పాటుచేసిన నిత్యానంద హిందూ సంప్రదాయాలను, నాగరికతను పునరుద్ధరిస్తున్నారు'' అని పేర్కొన్నారు. అనంతరం కైలాస నుంచే వచ్చిన మరో ప్రతినిధి ఈఎన్‌ కుమార్‌ సైతం మాట్లాడారు. అత్యాచారం, అపహరణ వంటి పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందపై భారత్‌లో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ సైతం జారీ అయింది. 2019లో దేశం నుంచి పారిపోయిన నిత్యానంద.. 2020లో ఈక్వెడార్‌ తీరానికి దగ్గర్లోని ఓ ద్వీపాన్ని కైలాస దేశంగా ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)