బెంగళూరులో ఆటో రిక్షా డ్రైవర్ల సమ్మె

Telugu Lo Computer
0


బెంగళూరులో ప్రైవేట్ బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్లకు వ్యతిరేకంగా వేలాది మంది ఆటోరిక్షా డ్రైవర్లు సోమవారం సమ్మె ప్రారంభించారు. ఆటోరిక్షా డ్రైవర్లకు, బైక్ ట్యాక్సీలకు మధ్య బెంగళూరు నగరంలో విపరీతమైన పోటీ ఉంది. చాలా మంది ప్రజలు ఆటోలను కాదని బైక్ ట్యాక్సీల మీద తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు నిర్ణయించుకుంటూ ఉన్నారు. ఇక కస్టమర్ల విషయంలో కూడా బెంగళూరు రోడ్లపై పోటీ పడుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు రెండు లక్షలకు పైగా ఆటోరిక్షాలు రోడ్లపై నిలిచిపోయాయని ఆదర్శ్ ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎం మంజునాథ్ తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ బైక్ ట్యాక్సీలను చట్టవిరుద్ధంగా చూస్తోందని.. అయినప్పటికీ ఎంతో మంది బైక్ ట్యాక్సీ డ్రైవర్లు ఇప్పటికీ నగర రోడ్లపై నడుపుతున్నారని మంజునాథ్ అన్నారు. ఆటోరిక్షా డ్రైవర్లు బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ నుండి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నివాసం వరకు ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)