గృహప్రవేశం చేసిన నాగ చైతన్య !

Telugu Lo Computer
0


సమంతతో విడిపోయిన తర్వాత ఎక్కువగా హోటల్స్‌లోనే ఉంటున్న నాగచైతన్య తాజాగా కొత్త ఇల్లు నిర్మించుకున్నాడు. ఉగాది సందర్భంగా కొత్తింట్లోకి వెళ్లాడు. నాగార్జున ఇంటికి దగ్గర్లోనే స్థలం కొన్న చై తన అభిరుచికి తగ్గట్లుగా ఇంటిని డిజైన్‌ చేయించుకున్నాడట !. స్విమ్మింగ్ పూల్, అందమైన గార్డెన్, జిమ్, థియేటర్ సహా విలాసవంతంగా ఇంటిని రెడీ చేసుకొని ఎలాంటి హడావిడి, ఆర్భాటం లేకుండా కొత్త గృహప్రవేశం చేశాడు. చైతూ ఇంట్లోకి మొదటి అతిథి ప్రేమమ్‌ సినిమాతో చైకు హిట్‌ ఇచ్చిన చందూ మొండేటి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసుకున్నారు. ఉగాది రోజున యువసామ్రాట్ కొత్త ఇళ్ళు. నేనే మొదటి అతిథి. కంగ్రాట్యూలేషన్ అండ్ థాంక్యూ నాగ చైతన్య అంటూ చందూ మొండేటి ఓ ఫోటోను పంచుకోగా ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)