నేను బ్రహ్మాండంగా ఉన్నాను ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 21 March 2023

నేను బ్రహ్మాండంగా ఉన్నాను !


తెలుగుతో పాటు దక్షిణాది లోని అన్ని భాషాల్లోనూ తన విలక్షణ నటనతో ఆకట్టుకున్న నటుడు కోట శ్రీనివాస రావు. విలన్‌గా భయపెట్టడంలోనైనా, కామెడీతో కడుపుబ్బా నవ్వించడంలోనూ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కన్నీళ్లు పెట్టించడంలోనైనా కోట శ్రీనివాస రావు స్టైలే వేరు. సినీ రంగంలో రాణించాలనుకునే అప్ కమింగ్ యాక్టర్లలో చాలా మంది కోట శ్రీనివాస రావును స్పూర్తిగా తీసుకుంటారు. వయస్సు మీద పడుతున్నా ఇప్పటికీ నటిస్తూ యువ నటీ నటులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే కోట శ్రీనివాస రావు మరణించాడంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనే స్వయంగా స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఆయన కొట్టిపారేశారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తన బాణీలో చమత్కరించారు. తప్పుడు వార్తలను నమ్మొద్దని కోట శ్రీనివాస రావు స్వయంగా వివరణ ఇచ్ఛారు.

No comments:

Post a Comment