ఆలయ ప్రమాదంలో 36కు చేరుకున్న మృతుల సంఖ్య

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో గురువారం నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ బెలేశ్వర మహాదేవ్ ఝులేలాల్ ఆలయం మెట్లబావికప్పు బావిలో పడిపోయింది. దీంతో అక్కడ ఉన్న భక్తులు అందుకలోకి పడిపోయారు. దీంతో నిన్నటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 36 కు చేరింది. మరణించిన వారి డేడ్ బాడీలను రెస్య్కూ టీమ్ వెలికితీశారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతన్నాయి. ఈ ప్రమాదం చోటు చేసుకున్న ఆలయం ఇండోర్ లోని పటేల్ నగర్ ప్రాంతంలో ఉంది. అయితే ఈ ఘటనలో 50 మందికి పైగా చనిపోయి ఉంటారని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఇండోర్ కలెక్టర్ ఇలియా రాజా టీ తెలిపారు. ఇప్పటికైతే 36 మంది చనిపోయారని తెలుస్తోందని చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో పలువురు చిన్నారులు మరణించినట్లు తెలుస్తోంది. నిన్న అర్థరాత్రి నుంచి ఆర్మీ టీమ్ కూడా రెస్య్కూ ఆపరేషన్ కోసం పిలిపించారు. పగలు 11 మృతదేహాలను, అర్థరాత్రి వరకు 24 డేడ్ బాడీలను కొనుగొన్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని .. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటించారు. కాగా.. మధ్యప్రదేశ్ సీఎం పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు.. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసింది తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలకు నాయకత్వం వహిస్తోందని ప్రధాని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)