పెళ్లి కోసం 28కి.మీ నడిచిన వరుడు !

Telugu Lo Computer
0


ఒడిశాలోని రాయగడ జిల్లాలోని కల్యాణ్‌ సింగ్‌పుర్ బ్లాక్​లోని సునాఖండి పంచాయతీకి చెందిన రమేష్ అనే యువకుడికి, దిబలపాడుకు గ్రామానికి చెందిన యువతితో పెళ్లి ఖాయమైంది. శుక్రవారం వధువు ఇంటి వద్ద  విహహం జరిగింది. ఈ పెళ్లి కోసం నాలుగు వాహనాలను ఏర్పాటు చేశారు. కానీ ఒడిశాలోని డ్రైవర్లు సమ్మె చేయడం వల్ల వాహనాల్లో వెళ్లేందుకు వీలు కాలేదు. దీంతో కాలినడకనే వధువు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. శుక్రవారం ఉదయం పెళ్లి అనంతరం వరుడి కుటుంబసభ్యులు వధువు ఇంటి వద్దే బస చేశారు. సమ్మె ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూశారు. సాయంత్రం డ్రైవర్ల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె ముగిసింది. దీంతో వారి ప్రయాణానికి సుగమమైంది. ఇదిలా ఉండగా, ఒడిశాలో డ్రైవర్లు భీమా, ఫించన్‌, సంక్షేమ బోర్డు ఏర్పాటు తదితరాలను కావాలని డిమాండ్‌ చేస్తూ డ్రైవర్‌ ఏక్తా మహాసంఘ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టింది. 90 రోజులుగా జరుగుతున్న నిరవధిక సమ్మెని డిమాండ్లన్నీ నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో విరమించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)