అస్సాంలోని అన్ని మదర్సాలను మూసేస్తాం

Telugu Lo Computer
0


భారత్‌లో మదర్సాల అవసరం లేదు అస్సాంలో అన్ని మదర్సాలను మూసివేస్తాం అంటూ ముఖ్యమంత్రి  హిమంత బిస్వా శర్మ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 600 మదర్సాలను ఇప్పటికే మూసివేశామని ఇక మిగిలినవాటిని కూడా త్వరలోనే మూసివేస్తామని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వలస వచ్చిన ప్రజలు భారత నాగరికతను, సంస్కృతికి ప్రమాదం సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. మాకు మదర్సాలు అవసరం లేదు వాటి స్థానంలో స్కూల్స్, కాలేజీలు, యూనివర్శిటీలు కావాలని అన్నారు. కర్ణాటకలోని బెళగావిలో పర్యటిస్తున్న సీఎం హిమంత ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మదర్సాలను మూసివేస్తామని దీని కోసం ఓ చెక్ లిస్ట్ తయారు చేశామని తెలిపారు. ఆధునిక భారత్‌లో మదర్సాల అవసరం లేదని, కొంతమంది చరిత్రను వక్రీకరించారని, వాస్తవాలను తప్పుగా చూపారని ఆరోపించారు. వక్రీకరించిన చరిత్రను కొత్త మార్గంలో తిరగరాయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా హిమంత కాంగ్రెస్ పై విమర్శస్తూ..కాంగ్రెస్‌ను 'ఆధునిక మొఘల్స్‌'గా అభివర్ణించారు. ఒకప్పుడు ఢిల్లీ పాలకు భారత్ లోని ఎన్నో దేవాలయాలను కూల్చివేశారు. మరెన్నింటినో ధ్వంసం చేశారు. కానీ ప్రధాని మోడీ పాలనలో దేవాలయాలు నిర్మితమవుతున్నాయి. ఇది కొత్త భారతదేశం..ఈ నవ భారతదేశాన్ని కాంగ్రెస్ నిర్వీర్యం చేయటానికి యత్నిస్తోంది అంటూ విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)