18న కన్యాకుమారికి రాష్ట్రపతి - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 15 March 2023

18న కన్యాకుమారికి రాష్ట్రపతి


రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 18న కన్యాకుమారి రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం తిరువనంతపురం చేరుకొని, అక్కడి నుంచి వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్‌ లో కన్యాకుమారి లోని టూరిస్ట్‌ బంగ్లా ప్రాంగణంలోని హెలిప్యాడ్‌లో దిగనున్నారు. అనంతరం రాష్ట్రపతి సముద్రంలో మధ్యలో ఉన్న వివేకానంద స్మారక మండపానికి మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక బోటులో వెళ్లనున్నారు. అక్కడ 30 నిమిషాలు గడిపే రాష్ట్రపతి కన్నియాకుమారిలో టూరిస్ట్‌ బంగ్లాలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కన్నియాకుమారి వివేకానందపురంలోని వివేకానంద కేంద్రానికి వెళ్లి రామాయణ దర్శన చిత్ర ప్రదర్శన తిలకించనున్నారు. అనంతరం భగవతి అమ్మన్‌ ఆలయానికి వెళ్లనున్న రాష్ట్రపతి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆమె తిరిగి తిరువనంతపురం మీదుగా ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రపతి రాకను పురస్కరించుకొని చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు బుధవారం సమావేశం నిర్వహించి చర్చించారు.

No comments:

Post a Comment