ప్రవీణ్ పెన్‍డ్రైవ్‍ పేపర్ల ఫోల్డర్ మొత్తం కాపీ !

Telugu Lo Computer
0


తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న టీఎస్పీఎస్సీ  ఏఈ పేపర్ లీక్ కేసు విచారణలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పులిదిండి ప్రవీణ్ కుమార్ పెన్ డ్రైవ్ లో మరిన్ని ప్రశ్నపత్రాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెన్ డ్రైవ్ లో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ పోస్టుల క్వశ్చన్ పేపర్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించినట్లు తెలుస్తోంది. రేణుక కోరిక మేరకే ప్రవీణ్  పేపర్ లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రవీణ్ కు డబ్బులిచ్చిన రేణుక, డాక్యా దంపతులు వాటిని అమ్ముకున్నారు. ప్రవీణ్ రాజశేఖర్ సాయంతోనే పేపర్లను తన పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకున్నట్లు గుర్తించారు. ఏఈ పేపర్ ఒక్కటే లీక్ అయినట్లు, మిగతా పేపర్లు బయటకు రాలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారి ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్ ఫోన్ లో పోలీసులు ఆశ్చర్యకరమైన అంశాలు కనుగొన్నారు. ఆ ఫోన్ లో 46 మంది మహిళలకు సంబంధించి కీలక సమచారం ఉన్నట్లు గుర్తించారు. వారు ఫొటోలు, వీడియోలు ఉన్నట్లు కనుగొన్నారు. ప్రవీణ్  కంప్యూటర్ నుంచి ఏఈ పేపర్ మాత్రమే కాపీ చేద్దామనుకున్నాడు. కానీ పేపర్ల ఫోల్డర్ మొత్తం కాపీ చేశాడు. దీంతో అందులో మిగతా పేపర్లు కూడా వచ్చాయి. అయితే ఈ పేపర్లకు సంబంధించి పరీక్ష తేదీ ఖరారు కాకపోవడంతో వాటిని బయటకు ఇవ్వనట్లు తెలుస్తోంది. ఏఈ పేపర్ మాత్రం రేణుక దంపతులు నీలేష్, గోపాల్ కు రూ.10 లక్షల చొప్పున అమ్మారు. వీరిద్దరే కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే చెప్పాలని రేణుక కోరడంతో ఈ క్రమంలోనే ఈ విషయం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)