ఏకకాలంలో 14 వాయిద్యాలను వాయిస్తాడు !

Telugu Lo Computer
0


గ్లాడ్‌సన్ పీటర్ అనే ఈ కళాకారుడు తన వీపుకు డ్రమ్స్‌ను తగిలించుకుని దాన్ని తన కాళ్లకు కనెక్ట్ చేసుకున్నాడు. అతను లయబద్ధంగా కదులుతుంటే డ్రమ్స్‌ను స్టిక్స్ వాయిస్తుంటాయి. చేతిలో గిటార్ ప్లే చేస్తుంటే మెడకు తగిలించుకున్న విజిల్, హార్మోనికా ప్లే అవుతుంటాయి. తన నడుముకు ఉన్న క్రాష్ సింబాల్స్ కూడా కాళ్ల కదలికలను బట్టి ప్లే అవుతుంటాయి. అయితే ఈ కళాకారుడికి టిబి సోకిన కారణంగా ఊపిరితిత్తుల సామర్ధం కేవలం 40 శాతం మాత్రమే ఉందని షెహనాజ్ తెలిపారు. ఇండియాలో ఇన్ని వాయిద్యాలను ఏకకాలంలో పలికించగల కళాకారుడిని తాను మాత్రమేనని, తనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం దక్కాల్సి ఉంటుందని పీటర్ అంటున్నాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే 3.8 లక్షల మందికి పైగా వీక్షించారు. పీటర్ ట్యాలెంట్‌కు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)