ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 16 March 2023

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట !


ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్షంగా బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌ రూ. 2లక్షల 79వేల 279 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు. మూలధన వ్యయం రూ.31,061కోట్లు. ఇక బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిన ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేసింది.

* వైయస్ఆర్ పెన్షన్ కానుక రూ.21,434.72 కోట్లు

* వైఎస్ఆర్ రైతు భరోసా రూ.4,020 కోట్లు

* జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు

* జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు

* వైయస్‌ఆర్-పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు

* డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు

* రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు

* వైయస్ఆర్ కాపు నేస్తం రూ.550 కోట్లు

* జగనన్న చేదోడు రూ.350 కోట్లు

* వైయస్‌ఆర్ వాహనమిత్ర రూ.275 కోట్లు

* వైయస్‌ఆర్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు

* వైయస్ఆర్ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు

* మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50 కోట్లు

* రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు

* లా నేస్తం రూ.17 కోట్లు

* జగనన్న తోడు రూ.35 కోట్లు

* ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు

* వైయస్‌ఆర్ కల్యాణమస్తు రూ.200 కోట్లు

* వైయస్ఆర్ ఆసరా రూ.6700 కోట్లు

* వైయస్ఆర్ చేయూత రూ.5000 కోట్లు

* అమ్మ ఒడి రూ.6500 కోట్లు

* ధరల స్థిరీకరణ నిధి రూ.3,000 కోట్లు

* వ్యవసాయ యాంత్రీకరణ రూ.1,212 కోట్లు

* వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం రూ.15,882 కోట్లు

* మన బడి నాడు-నేడు రూ.3,500 కోట్లు

* జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు

* పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.15,873 కోట్లు

* పురపాలక, పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు

* స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రూ.1,166 కోట్లు

* యువజన అభివృద్ధి, పర్యాటకం, సాంస్కృతిక శాఖ రూ.1,291 కోట్లు

* షెడ్యూల్ కులాల కాంపొనెంట్ కోసం రూ.20,005 కోట్లు

* షెడ్యూల్ తెగల కాంపొనెంట్ కోసం రూ.6,929 కోట్లు

* వెనుకబడిన తరగతుల కాంపొనెంట్ కోసం రూ.38,605 కోట్లు

* కాపు సంక్షేమం రూ.4,887 కోట్లు

* మైనార్టీల సంక్షేమం రూ.4,203 కోట్లు

* పేదలు అందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు

* పరిశ్రమలు, వాణిజ్యం రూ.2,602 కోట్లు

* రోడ్లు, భవనాల శాఖకు రూ.9,118 కోట్లు

* నీటి వనరుల అభివృద్ధికి (ఇరిగేషన్‌) రూ.11,908 కోట్లు

* పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ రూ.685 కోట్లు

* ఎనర్జీ రూ.6,456 కోట్లు

* గ్రామ, వార్డు సచివాలయ శాఖకి రూ.3,858 కోట్లు

* గడప గడపకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు

* 2023-2024 బడ్జెట్ అంచనా రూ.2,79,279

No comments:

Post a Comment