ప్రియురాలు చూస్తుండగానే మర్మాంగాన్ని కోసుకున్న ప్రియుడు !

Telugu Lo Computer
0


గుజరాత్ లోని రాజ్‌కోట్‌లో పశ్చిమ బెంగల్‌కు చెందిన ప్రసన్న జీత్ బర్మన్ తన మామయ్య శపన్ బర్మాతో కలిసి ఉంటున్నాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు అక్కడ ఓ కంపెనీలో జాబ్ చేస్తున్న క్రమంలో అమ్మాయి పరిచయం కావడంతో ప్రేమగా మారింది. ఇద్దరు మధ్య కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో ప్రియురాలికి  వీడియో కాల్ చేసి ఆమె చూస్తుండగానే మర్మాంగాన్ని కట్ చేసుకున్నాడు. వెంటనే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. రూమ్‌లో శపన్ బర్మన్ వచ్చేసరికి అల్లుడు రక్తపు మడుగులో కనిపించడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రసన్న జీత్ శస్త్ర చికిత్స చేశారు. ప్రసన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)