గుండెపోటుతో కుప్పకూలిన వరుడు

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్ లో సమీర్ ఉపాధ్యాయ (30) అనే దంత వైద్యుడికి శుక్రవారం వివాహం జరిపేందుకు ముహూర్తం నిర్వహించారు. ఇందుకోసం కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వరుడిన ఊరేగింపుగా వెళ్లి మండపం వద్దకు తీసుకొచ్చారు. ఆ తర్వాత వివాహ తంతు మొదలైంది. వధువుతో కలిసి ఏడుగులు వేస్తున్న సమయంలో సమీర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో అప్పటివరకు బంధుమిత్రులు ఆనందోత్సవాల మధ్య కళకళలాడిన పెళ్లిమండంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. కుప్పకూలిన సమీర్‍ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు గుండెపోటుతో మరణించినట్టు నిర్ధారించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)