పాకిస్తాన్ మంత్రుల జీతాల్లో కోతలు

Telugu Lo Computer
0


పాకిస్తాన్ లో  ద్రవ్యోల్బణం దాదాపు 30 శాతానికి చేరుకుంది. పాకిస్థాన్ కు చైనా ఆర్థిక సాయం ప్రకటించింది. అదే సమయంలో ఐఎంఎఫ్  కూడా రుణం ఇవ్వడానికి బదులుగా కఠినమైన షరతులు విధించింది. ఐఎంఎష్ షరతులకు పాకిస్తాన్ తలొగ్గాల్సి వచ్చింది. వీటన్నింటి మధ్య, పాకిస్తాన్ తన ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు పాకిస్తాన్ మంత్రుల జీతాల్లో కోత పెట్టేందుకు రంగం సిద్దం చేసింది. కరెంటు, నీరు, ఫోన్ బిల్లులు కూడా వారే చెల్లించాలని తెలిపింది. మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, సలహాదారులందరికీ జీతం, ఇతర అలవెన్సులు ఇవ్వబోమని ఇస్లామాబాద్ లో విలేకరుల సమావేశంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. అంతేకాదు కేబినెట్ మంత్రులందరి నుండి వారి వాహనాలను కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు షాబాజ్ షరీఫ్ చెప్పారు. దీంతో మంత్రికి ఒక సెక్యూరిటీ వాహనం మాత్రమే ఇవ్వనున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత దేశానికి తక్షణ సాయం అందించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని షాబాజ్ చెప్పారు. ఈ కొత్త చర్యల ప్రకారం, మంత్రులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకులందరూ తమ జీతాలను తీసుకోకూడదని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)