పసిపాపపై కోతులు దాడి !

Telugu Lo Computer
0


తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగుల గూడెంలో రెండునెలల పాపపై కోతులు దాడి చేశాయి. ఇంటి వరండాలో చిన్నారిని పడుకోబెట్టడంతో  చుట్టుముట్టిన కోతులు దాడికి దిగాయి. చిన్నారి కాలి బొటన వేలుని బలంగా కొరికాయి. తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది చిన్నారి కాలి బొటన వేలు నుంచి రక్తం ధారగా కారడం కనిపించింది. కోతి దాడిలో సగం వేలు కూడా కోల్పోయింది. శరీరంపై పలుచోట్ల గాయాలు కూడా అయ్యాయి. దీంతో చిన్నారిని ఎత్తుకుని తల్లిదండ్రులు ఆస్పత్రికి పరుగులు తీశారు. చికిత్స కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్‌ ఏరియాలో కోతుల బెడద భారీగా ఉంది.


Post a Comment

0Comments

Post a Comment (0)