నాగాలాండ్, మేఘాలయల్లో ​కొనసాగుతున్న పోలింగ్‌

Telugu Lo Computer
0


నాగాలాండ్, మేఘాలయల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం గం. 7.00లకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఇరు రాష్ట్రాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్‌ జరుగనుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా, రెండు రాష్ట్రాల్లో 552 మంది బరిలో ఉన్నారు. 34 లక్షలకు పైగా ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. మేఘాలయాలో 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా, బరిలో 369 మంది అభ్యర్థులు నిలిచారు. 21.6 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 60 స్థానాలకుకు గాను 59 స్థానాల్లో పోటీ జరుగునుంది. ఇక్కడ ఒక స్థానాన్ని బీజేపీ ముందుగానే కైవసం చేసుకుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఖతేజో కినిమి అకులుటో నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగాలాం్‌లో 183 మంది బరిలో ఉన్నారు. ఇక్కడ ఓటర్లు సంఖ్య 13లక్షలకుపైగా ఉంది. మేఘాలయాలో ఇప్పటిదాకా ఏపార్టీకి పూర్తి మెజార్టీ దక్కలేదు. నాగాలాండ్‌లో ఏ పార్టీ అన్నిచోట్లా పోటీకి దిగలేకపోయింది. ఇక తమిళనాడు, అరుణాచల్‌ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌లలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)