కే. విశ్వనాథ్‌ సతీమణి జయలక్ష్మి కన్నుమూత - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 26 February 2023

కే. విశ్వనాథ్‌ సతీమణి జయలక్ష్మి కన్నుమూత


కళాతపస్వి కే. విశ్వనాథ్‌ సతీమణి జయలక్ష్మి(86) గుండెపోటుతో ఆదివారం ఆమె కన్నుమూశారు. కే. విశ్వనాథ్‌  కన్నుమూసిన 24 రోజులకే ఆమె మృతి చెందడం గమనార్హం. ఫిబ్రవరి 2వ తేదీన వృద్ధాప్యరీత్యా సమస్యలతో దర్శక దిగ్గజం కాశీనాధుని విశ్వనాథ్‌ (92) కన్నుమూశారు. అయితే  ఆయన మృతి చెందినప్పటి నుంచి జయలక్ష్మి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం గుండెపోటు రావడంతో ఆమె కూడా కన్నుమూసినట్లు సమాచారం. విశ్వనాథ్‌కు 20 ఏళ్ల వయసున్నప్పుడు జయలక్ష్మితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. ఎవరూ సినీ పరిశ్రమలోకి ప్రవేశించలేదు. అలాగే.. తన భార్య తనతో ఎప్పుడూ సినిమాల గురించి చర్చించేది కాదని, సినిమాలను కూడా విశ్లేషించేది కాదని తరచూ ఇంటర్వ్యూలలో ఆయన  కూడా చెప్పారు.

No comments:

Post a Comment