ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల పోరుబాట !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాటకు సిద్దమయ్యారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరిస్తామని మాటిచ్చి, ఆంక్షలతో పేరుతో వేధిస్తోందని  జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. తాము రాయితీలను కూడా పోగొట్టుకొని ప్రభుత్వనికి సహకరిస్తుంటే పాలకులు తమను చిన్నచూపు చూస్తున్నారని ఉద్యోగస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వ తీరును ఎండగడుతూ తొలి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడలో ఏపీ అమరావతి జేఏసీ సమావేశమై. ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. వచ్చే నెల 9వ తేది నుంచి ఏప్రిల్‌ 5వ తేది వరకు చేపట్టబోయే కార్యక్రమాల షెడ్యూల్‌ని ప్రకటించారు. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే రెండో దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. మార్చి 8, 9 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన, మార్చి 13,14 తేదీల్లో జిల్లా కలెక్టరెట్‌లు, ఆర్డీవో ఆఫీస్‌ల ముందు లంచ్ బ్రేక్‌లో ఆందోళనలు, మార్చి 15,17,20తేదీల్లో అన్నీ జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు జేఏసీలోని అన్నీ ఉద్యోగ సంఘాలతో ధర్నాలు, మార్చి 21నుంచి వర్క్‌ టు రూల్, మార్చి 21న ఉద్యోగుల సెల్ డౌన్, మార్చి 24న రాష్ట్రంలోని హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్ ఆఫీసుల వద్ద ధర్నా, మార్చి 27న కరోనా సమయంలో, తర్వాత చనిపోయిన ఉద్యోగుల కుటుబాలకు భరోసా, ఏప్రిల్‌ 1వ తేదిన ఏప్రిల్‌ ఫూల్‌ డే కాబట్టి రిటైర్మెంట్, సర్వీస్‌ బెనిఫిట్స్‌పై పోరాటం, ఏప్రిల్ 3న అన్నీ జిల్లాల్లో ఛలో స్పందన కార్యక్రమాలు..కలెక్టర్లకు మెమోరండం సమర్పణ, ఏప్రిల్ 5న రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాలు. 

Post a Comment

0Comments

Post a Comment (0)